దేవరయాంజాల్‌లో లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ జిల్లా: షామీర్‌పేట్ మండలంలోని దేవరయాంజాల్ గ్రామ పరిధిలోని కోల్డ్‌రష్ లాజిస్టిక్స్ గోదాంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం నుంచి గోదాంలో మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.ప్రమాదం నేపథ్యంలో డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బందితో పాటు ఎయిర్‌ఫోర్స్, పోలీసులు,...