RJNEWS TELUGU
Date of Publish : 28 October 2026, 9:23 pm Posted by : RJ NEWS TELUGU

చర్లపల్లికి పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి

🔸డీఎంహెచ్‌వోను కోరిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : చర్లపల్లి ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు మేడ్చల్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. చర్లపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్‌సీ అవసరమని వివరించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో పాటు, ప్రాథమిక చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డీఎంహెచ్‌వో త్వరలో చర్లపల్లి ప్రాంతాన్ని సందర్శించి, పీహెచ్‌సీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అవసరమైన వివరాలు సేకరిస్తామని తెలిపారు.