నీళ్ల సమస్య పరిష్కారానికి వినతి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూర్- కిష్టాపూర్ డివిజన్ రాఘవేంద్ర నగర్ నెలకొన్న నీళ్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మాధురికి వినతి పత్రం సమర్పించారు. కాలనీకి సక్రమంగా నీళ్లు సరఫరా కావడం లేదని, నాలుగైదు రోజులకు ఒక మారుకూడా నీళ్లు ఇవ్వడంలేదని ఏఎంసీ దృష్టికి తీసుకువచ్చారు. ట్యాంకర్లు కొనడం భారంగా మారిందని, అవి కూడా ఒక్కోసారి దొరకడం లేదని తెలిపారు. వెంటనే నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు....