RJNEWS TELUGU
Date of Publish : 20 September 2026, 7:51 am Posted by : RJ NEWS TELUGU

ఓఆర్‌ఆర్‌పై వరుస ప్రమాదాలు.. ముగ్గురు మృతి

నిలిచివున్న మినీ వ్యాన్‌ను ఢీకొన్న టాటా ట్రక్‌

మరో ఘటనలో డివైడర్‌ను ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం

ఆర్ జె న్యూస్, శామీర్ పేట : ఓఆర్‌ఆర్‌పై రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలుచోటుచేసుకున్నాయి. ఒక ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఘటనలో పెను ప్రమాదం తప్పింది.

 మినీ వ్యాన్‌ను ఢీకొన్న టాటా ట్రక్‌

కీసర – శామీర్‌పేట మధ్య ఓఆర్‌ఆర్‌పై నిలిచివున్న అశోక్‌ లేలాండ్‌ మినీ వ్యాన్‌ను టాటా ట్రక్‌ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

డివైడర్‌ను ఢీకొన్న లారీ

మరోవైపు మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్‌ 6 సమీపంలో లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే లారీ ముందు భాగం భారీగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.