వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నీటితో నిండాలని, పంటలు పండించి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని చిన్న చెరువు వద్ద ఘట్‌కేసర్‌ జామా మసీదు కమిటీ, బాలాజీనగర్‌లోని మహమ్మదియా మసీదు కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక నమాజు నిర్వహించారు. వర్షాల కోసం చేసే ఈ ప్రత్యేక ప్రార్థనను ఇస్లాంలో ‘సలాతుల్‌ ఇస్తిస్కా’గా పిలుస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో ముస్లిం సోదరులు సామూహికంగా...