రైతుల జీవన విధానంపై సీఎంఆర్‌ విద్యార్థుల అధ్యయనం

అత్తెల్లిలో రైతులతో ముచ్చటించిన విద్యార్థులు ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : సీఎంఆర్‌ కళాశాల విద్యార్థులు మేడ్చల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని 298వ డివిజన్‌ అత్తెల్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, స్థానికులతో మాట్లాడి వారి జీవన విధానం, వ్యవసాయ పరిస్థితులు, భవిష్యత్‌ అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు.రైతులతో ముచ్చటించిన విద్యార్థులు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు, పంటల సాగు, రైతుల భవిష్యత్‌ పరిస్థితులపై సమాచారం సేకరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా స్థానికులతో మాట్లాడటం ద్వారా పలు విషయాలను తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు.విద్యార్థులకు అవసరమైన భోజనం, తాగునీరు తదితర ఏర్పాట్లను...