ఆస్ట్రేలియాలో మాజీ మంత్రి మల్లారెడ్డికి ఘన స్వాగతం

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం బ్రిస్బేన్ విమానాశ్రయానికి చేరుకున్న మల్లారెడ్డికి బీఆర్ఎస్ ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ కన్వీనర్ విన్నీ తూముకుంట ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ అధినేత...