RJNEWS TELUGU
Date of Publish : 26 September 2026, 8:06 am Posted by : RJ NEWS TELUGU

పనికి వెళ్లి తిరిగిరాని యువతి

ఆర్ జె న్యూస్, శామీర్ పేట : జీనోమ్‌ వ్యాలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మజీద్‌పూర్‌కు చెందిన కీర్తన (19) అదృశ్యమైంది. ఈ నెల 23న ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి పనికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. రావల్‌కోల్‌లోని ఓ నర్సరీలో కీర్తన నాలుగు నెలలుగా పనిచేస్తోంది.కీర్తన ఎత్తు సుమారు 4.8 అడుగులు, గోధుమ వర్ణంలో ఉంటుందని పోలీసులు తెలిపారు. అదృశ్యమైన సమయంలో లైట్‌ బ్లూ టాప్‌, బ్లాక్‌ లెగ్గిన్‌, బ్లాక్‌ చున్నీ ధరించి ఉంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు 8712663689కు సమాచారం అందించాలని జీనోమ్‌ వ్యాలీ సీఐ గురువయ్యగౌడ్‌ కోరారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు