పాలిటెక్నిక్‌ కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

🔸 ఈ నెల 25న రాష్ట్రవ్యాప్త బంద్‌.. జీవో 97కు వ్యతిరేకంగా ఆందోళన ఆర్.జె.న్యూస్, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన శక్తి పథకం కింద పారిశ్రామిక శిక్షణా సంస్థలు, అధునాతన సాంకేతిక కేంద్రాలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను ఒకే పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నెల 25న బంద్‌ నిర్వహించనున్నట్లు ఏబీవీపీ సాంకేతిక విభాగం రాష్ట్ర సహ కన్వీనర్‌ కుడికాల హర్షిత్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్‌ 97...