కీసరలో ఏసీబీ ట్రాప్..! రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఎస్సై పట్టివేత.. ఇన్‌స్పెక్టర్‌పైనా ఆరోపణలు
అర్ జె న్యూస్ కీసర : మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. కీసర చెరువు సమీపంలో కారులో రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.5 లక్షలు ఎస్సైకి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడు ఏసీబీ...