RJNEWS TELUGU
Date of Publish : 18 September 2026, 7:35 am Posted by : RJ NEWS TELUGU

మేడ్చల్ జాతీయ రహదారిపై ఎంపీ అరవింద్ వాహనానికి ప్రమాదం

🔸తృటిలో తప్పిన ప్రమాదం.. ఘటనా స్థలానికి గుమిగూడిన ప్రజలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ప్రయాణిస్తున్న వాహనానికి మేడ్చల్‌ జాతీయ రహదారిపై ప్రమాదం తప్పింది. నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ నగరం వైపు వస్తుండగా రేకబావుల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఎర్టిగా వాహనం అడ్డుగా రావడంతో ఎంపీ ప్రయాణిస్తున్న వాహనం దానిని ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎంపీ అరవింద్‌కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎంపీ అరవింద్‌ వాహనం నుంచి దిగి పరిస్థితిని పరిశీలించారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి గుమిగూడారు. ఎంపీ స్వయంగా పరిస్థితిని సర్దిచేయడంతో కొద్దిసేపటి తర్వాత అక్కడ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది.ప్రమాదానికి గల పూర్తి కారణాలు, వాహనాలకు జరిగిన నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.