మేడ్చల్ జాతీయ రహదారిపై ఎంపీ అరవింద్ వాహనానికి ప్రమాదం
🔸తృటిలో తప్పిన ప్రమాదం.. ఘటనా స్థలానికి గుమిగూడిన ప్రజలు ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రయాణిస్తున్న వాహనానికి మేడ్చల్ జాతీయ రహదారిపై ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నగరం వైపు వస్తుండగా రేకబావుల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఎర్టిగా వాహనం అడ్డుగా రావడంతో ఎంపీ ప్రయాణిస్తున్న వాహనం దానిని ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎంపీ అరవింద్‌కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎంపీ అరవింద్...