RJNEWS TELUGU
Date of Publish : 09 October 2026, 9:28 am Posted by : RJ NEWS TELUGU

మల్లికార్జున నగర్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

 ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మల్కాజ్‌గిరి గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ రోడ్ నంబర్‌–7లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, నూతన డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం కాలనీవాసులు స్థానిక బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్‌తో కలిసి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అలాగే మల్లికార్జున నగర్‌లో నెలకొన్న యూఎల్‌సీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. మరోవైపు జ్యోతి నగర్ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగునీటి అవసరాల కోసం పవర్ బోర్ ఏర్పాటు చేయాలని కోరుతూ కాలనీవాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కాలనీవాసుల సమస్యలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. డ్రైనేజీ, పవర్ బోర్ సమస్యలను మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. మల్లికార్జున నగర్‌లోని యూఎల్‌సీ సమస్యను మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున నగర్, జ్యోతి నగర్ కాలనీలకు చెందిన పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.