మల్లికార్జున నగర్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

 ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మల్కాజ్‌గిరి గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ రోడ్ నంబర్‌–7లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, నూతన డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం కాలనీవాసులు స్థానిక బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్‌తో కలిసి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అలాగే మల్లికార్జున నగర్‌లో నెలకొన్న యూఎల్‌సీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. మరోవైపు జ్యోతి నగర్ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా...