ఉప్పరపల్లి భూ సమస్య పరిష్కారానికి చర్యలు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్: శామీర్‌పేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని ప్లాట్ల సమస్యను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం ఇన్‌చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆదేశించారు.ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పి.బాలేష్ బేగంపేటలోని ప్రజావాణి కార్యక్రమంలో డాక్టర్ చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని ప్లాట్లకు సంబంధించి కొంతకాలంగా నెలకొన్న సమస్యను ఆయన వివరించారు. ఈ సమస్య కారణంగా భూములపై ఆధారపడిన అర్హులైన పేదలు ఇబ్బందులు...