భూ రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వేలో భాగంగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం మాదారం, కీసర మండలం నర్సంపల్లి గ్రామాల్లో గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి పర్యటించారు. కొనసాగుతున్న భూ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పట్టాదారు పాస్‌బుక్‌లోని భూ ఆధార్‌ నంబర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో భూమి లోకేషన్‌ను గుర్తిస్తున్నట్లు ఆయా మండలాల తహసీల్దార్లు అదనపు కలెక్టర్‌కు వివరించారు. ఈ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. సర్వే జరుగుతున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సర్వే పనులను...