సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్బరుద్దీన్ ఓవైసీ..! కూతురి వివాహానికి ఆహ్వానం అందజేత

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ తన కూతురి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. వివాహ వేడుకకు సంబంధించిన వివరాలను అక్బరుద్దీన్ ఓవైసీ...