ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : రక్షాబంధన్ సందర్భంగా అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఆమె కుమార్తె తన్వి శ్రీరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీఎంకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌కు కూడా శిరీష రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ చేస్తున్న కృషిని అభినందించారు.
