RJNEWS TELUGU
Date of Publish : 22 September 2026, 12:02 pm Posted by : RJ NEWS TELUGU

డబీల్ పూర్ రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

🔸పట్టాల పక్కన బైక్.. అనుమానాస్పదంగా మృతి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబీల్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్ర కలకలం రేగింది. రైలు పట్టాల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మృతదేహానికి సమీపంలోనే AP 23 AJ 8499 నంబర్ గల ద్విచక్ర వాహనం నిలిపి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది రైలు ప్రమాదమా..? లేక హత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా మృతుడి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.