బాచుపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి..! ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : బాచుపల్లిలోని సిల్వర్ ఓక్స్ స్కూల్ గేట్ వద్ద సోమవారం ఉదయం మూర్ఛ (ఫిట్స్) వచ్చి పడిపోయిన గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. సోమవారం ఉదయం సిల్వర్ ఓక్స్ స్కూల్ ప్రధాన గేట్ సమీపంలో సుమారు 35–40 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ఫిట్స్ వచ్చి స్పృహ కోల్పోయి పడిపోయి ఉండటాన్ని బాచుపల్లి పోలీస్ సిబ్బంది గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, అక్కడ...