RJNEWS TELUGU
Date of Publish : 09 November 2026, 1:40 pm Posted by : RJ NEWS TELUGU

కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో ఏసీబీ వల

🔸రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ పట్టుబాటు

🔸ఇదే స్టేషన్‌లో గతంలో సీఐ అరెస్ట్.. వరుస అవినీతి ఘటనలతో పోలీస్‌శాఖలో కలకలం

ఆర్ జె న్యూస్, కీసర : కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది.ఇదే పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మరువకముందే మరో ఎస్‌ఐ చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఒకే పోలీస్‌స్టేషన్‌లో వరుసగా అవినీతి ఘటనలు చోటుచేసుకోవడం పోలీస్‌శాఖలో కలకలం రేపుతోంది.