జాతీయ మానవ హక్కుల కమిషన్ షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి:
జిల్లా కలెక్టర్ రాజర్షి షా జూన్ 29, 2026 , ఆదిలాబాద్ : మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక బాధ్యతలు, రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిర్వహిస్తున్న 2026 షార్ట్ ఫిలిం కాంపిటీషన్‌లో జిల్లాకు చెందిన యువత, విద్యార్థులు, సినీ అభిరుచి కలిగిన వారు, స్వచ్ఛంద సంస్థలు, చిత్ర నిర్మాతలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మానవ హక్కుల పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళలు,...