గొర్రెల కాపరుల ఆత్మరక్షణకు ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలి
🔸గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలపై జీఎంపీఎస్ సమగ్ర సర్వే ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : గొర్రెలు, మేకల పెంపకందారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఆత్మరక్షణ కోసం ఆయుధాల లైసెన్సులు మంజూరు చేయాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డెబిల్పూర్, మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని అత్తివెల్లి గ్రామాల్లో సంఘం ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెంపకందారుల స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా జీఎంపీఎస్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి...