తండ్రిపై సుత్తి, రోలుతో దాడి..! హత్యాయత్నం కేసులో నిందితుడు పవన్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రిపై కుమారుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సుత్తి, రోలుతో పలుమార్లు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు పవన్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. మాధురి నాగరాజు (53) వాచ్‌మన్‌గా పనిచేస్తుండగా, ఆయన కుమారుడు మాధురి పవన్ (25) కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నివసిస్తున్నారు. పవన్...