యాప్రాల్ ఎక్స్‌రోడ్స్‌లో హత్యాయత్నం కేసు ఛేదన..!
🔸ముగ్గురు నిందితుల అరెస్ట్.. కత్తి, బైక్ స్వాధీనం 🔸 సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్న జవహర్ నగర్ పోలీసులు ఆర్.జె.న్యూస్, మేడ్చల్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ ఎక్స్‌రోడ్స్ వద్ద జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు సందీప్ కుమార్‌పై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎసిపి చక్రపాణి మీడియాకు వివరాలను వెల్లడించారు. సందీప్ కుమార్ అలియాస్ కట్లస్,...