మహిళలపై హింసకు వ్యతిరేకంగా అలియాబాద్‌లో అవగాహన

ఆర్ జె న్యూస్, శామీర్ పేట : మహిళలు, బాలికలపై హింసను అరికట్టడంతో పాటు వారికి చట్టపరమైన రక్షణ, న్యాయం అందించడంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి అన్నారు. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం అలియాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు చేపట్టనున్న 16 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ...