పారా లీగల్ వాలంటీర్లకు అవగాహన సమావేశం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పారా లీగల్ వాలంటీర్లు తమ విధులు, బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.ఎస్.ఎల్. ప్రియాంక సూచించారు. ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కర్‌రావు ఆదేశాల మేరకు గురువారం కుషాయిగూడలో పారా లీగల్ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ చట్టం ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు. పారా లీగల్ వాలంటీర్ల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను...