పిల్లల భద్రతపై అవగాహన.. పోక్సో చట్టంపై చైతన్యం
🔸జిల్లాలో ఐదు పాఠశాలల్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలు ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పిల్లలపై లైంగిక నేరాల నివారణ, బాలల హక్కుల పరిరక్షణ, ఆన్లైన్ వేధింపుల పట్ల అప్రమత్తత కల్పించడమే లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని ఐదు పాఠశాలల్లో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాలు నిర్వహించారు. పోక్సో చట్టం–2012పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన జిల్లా న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు ఆదేశాల మేరకు బోడుప్పల్, కాప్రా,...