రూఫ్‌టాప్ సోలార్‌పై అవగాహన కార్యక్రమాలు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటుతో సౌర విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేసేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన (సేవా సేతు అభియాన్)లో భాగంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. అక్టోబరు 2 నుంచి 4వ తేదీ వరకు మేడ్చల్ డీఈ కార్యాలయం, వినియోగదారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ డీఈ జాన్...