గడువు ముగిసిన పదార్థాలతో బేకరీ ఉత్పత్తులు.. ఇద్దరి అరెస్ట్ జీనోమ్ వ్యాలీ పరిధిలో ఎస్‌వోటీ దాడులు.. కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు స్వాధీనం
మేడ్చల్ ఆర్జేన్యూస్ : జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్‌పూర్‌లో అక్రమంగా ఏం సి ఆర్ బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ బృందం దాడులు నిర్వహించింది. ట్రేడ్, ఫుడ్ లైసెన్సులు లేకుండానే గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు, వివిధ రకాల ఫ్లేవర్లతో బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించింది. తయారీ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.దాడుల్లో మజీద్‌పూర్ క్రాస్ రోడ్‌కు చెందిన బోడ ఆనంద్ (38), బోడ...