నిషేధిత రంగులతో బేకరీ ఉత్పత్తులు..! కేసు నమోదు కొల్తూరులో శ్రీ సాయి బేకరీపై పోలీసుల తనిఖీలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రభుత్వం నిషేధించిన హానికరమైన సింథటిక్ రంగులు, ఫ్రూట్ ఫ్లేవర్లను ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై కొల్తూరు గ్రామంలోని ఓ బేకరీ యజమానిపై జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. జినోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రాత్రి జినోమ్ వ్యాలీ పోలీసులు, ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ పోలీసులు సంయుక్తంగా కొల్తూరులోని శ్రీ సాయి బేకరీలో తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో ప్రభుత్వం నిషేధించిన సింథటిక్ కలర్స్, మిక్స్‌డ్ ఫ్రూట్ ఫ్లేవర్స్‌కు...