బాసర సరస్వతీ ఆలయ చోరీ కేసు ఛేదన – ముగ్గురు నిందితుల అరెస్ట్

నిర్మల్ (ఆర్ జె న్యూస్) జూలై 3 : నిర్మల్ జిల్లా బాసరలోని ప్రముఖ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 22వ తేదీన ఆలయంలోని మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, వెండి పట్టీతో పాటు హుండీలోని నగదును అపహరించి పరారైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో బాసర రైల్వే స్టేషన్‌లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన...