కేఎల్ఆర్ వెంచర్ లో మౌలిక సమస్యలకు త్వరలో చెక్

🔸రెండు రోజుల్లో డ్రైనేజీపై జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్‌ సర్కిల్‌ పరిధిలోని కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో నెలకొన్న మౌలిక సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జోనల్‌ కమిషనర్‌ పింకేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రైనేజీ లీకేజీలు, తాగునీటి ఎద్దడి, అంతర్గత రహదారుల దుస్థితిని పరిశీలించారు. స్థానికులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమస్యలపై చర్చించారు. డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో గతంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులు చిన్నగా ఉండటంతోపాటు పలుచోట్ల దెబ్బతిన్నాయని,...