స్ఫూర్తి కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలో స్ఫూర్తి జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు మంజుల ప్రకాష్, కమలాకర్ రెడ్డి, దేవరాజ్, గణేష్, రామ్ శంకర్, సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.