సీఎంఆర్ఐటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

🔸తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: డైరెక్టర్ జంగారెడ్డి ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయ సీఎంఆర్ఐటీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ గ్రూప్ సెక్రటరీ గోపాల్ రెడ్డి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ జంగారెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే విశిష్టమైన పండుగ అని అన్నారు....