ప్రకృతి ఆరాధనకు ప్రతీక బతుకమ్మ పండుగ : కలెక్టర్ దీపక్ తివారి
ఆర్ జె న్యూస్, వికారాబాద్ : ప్రకృతిలో లభించే పూలను దేవతగా పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహర, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని...