RJNEWS TELUGU
Date of Publish : 12 November 2026, 8:54 am Posted by : RJ NEWS TELUGU

ఏడుగుళ్ల దేవాలయం తొలగింపుపై భగ్గుమన్న నిరసన

🔸200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని తొలగించొద్దు.. అధికారులకు స్థానికుల డిమాండ్

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మేడ్చల్ పట్టణంలోని ప్రసిద్ధ ఏడుగుళ్ల దేవాలయాన్ని తొలగించేందుకు అధికారులు నోటీసులు జారీ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ తొలగింపును వ్యతిరేకిస్తూ బుధవారం ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు దేవాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.సోమవారం రహదారి నిర్వహణ అధికారులు ఆలయ తొలగింపునకు సంబంధించి నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం పట్టణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలతో ముడిపడి ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తరతరాలుగా పూజలందుకుంటున్న ఆలయాన్ని తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయాన్ని యథాతథంగా కొనసాగించాలని, అధికారులు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసనలో మాజీ సర్పంచ్ దేవేందర్ రెడ్డి, బాల మల్లేష్, రాఘవేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు స్వామి యాదవ్, గౌడ మహేష్, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.