ఏడుగుళ్ల దేవాలయం తొలగింపుపై భగ్గుమన్న నిరసన
🔸200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని తొలగించొద్దు.. అధికారులకు స్థానికుల డిమాండ్ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మేడ్చల్ పట్టణంలోని ప్రసిద్ధ ఏడుగుళ్ల దేవాలయాన్ని తొలగించేందుకు అధికారులు నోటీసులు జారీ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ తొలగింపును వ్యతిరేకిస్తూ బుధవారం ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు దేవాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.సోమవారం రహదారి నిర్వహణ అధికారులు ఆలయ తొలగింపునకు సంబంధించి నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది....