RJNEWS TELUGU
Date of Publish : 01 November 2026, 8:11 pm Posted by : RJ NEWS TELUGU

కేటీఆర్ కు గుమ్మడికాయతో దిష్టి తీసిన భాస్కర్ యాదవ్

ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : అదిలాబాద్ లో ‘రైతు గర్జన’ సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మేడ్చల్‌ పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ కేటీఆర్ కు గుమ్మడికాయతో దిష్టి తీశారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.