RJNEWS TELUGU
Date of Publish : 09 October 2026, 9:35 am Posted by : RJ NEWS TELUGU

పైపుల లోడు పడి ద్విచక్రవాహనదారుడి మృతి

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇనుప పైపుల లోడుతో వెళ్తున్న ఆటో బోల్తాపడటంతో పైపుల లోడు పక్కనే వెళ్తున్న ద్విచక్రవాహనంపై పడింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కింద ఆటో యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో ఒకవైపు బరువు ఒరిగి బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న ఇనుప పైపులు పక్కనే వెళ్తున్న బైక్‌పై పడటంతో దానిపై ప్రయాణిస్తున్న ప్రకాశ్‌ పవర్‌ (56) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.ప్రమాద ఘటన సమీపంలోని దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.