RJNEWS TELUGU
Date of Publish : 28 August 2026, 5:38 pm Posted by : RJ NEWS TELUGU

ఘనంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ జన్మదిన వేడుకలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బొంగులూరు శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి శ్రీనివాస్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధితో పాటు విద్యార్థులు, యువతకు గ్రంథాలయ సేవలను మరింత చేరువ చేసేందుకు శ్రీనివాస్‌రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. పుస్తక పఠనంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.అనంతరం నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస్‌రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్‌, డివిజన్‌ అధ్యక్షుడు చాపరాజు, మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, రంజిత్‌, కోమలి తదితరులు పాల్గొన్నారు.