రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు బిట్స్ పిలానీ, డీఐఏటీ భారీ అడుగు
🔸 హైదరాబాద్ లో డిఫెన్స్ & ఏరోస్పేస్ ఇండస్ట్రీ డే 2026.. 20 కీలక ఒప్పందాలు ఆర్ జె న్యూస్, శామీర్ పేట : దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగంలో స్వదేశీ ఆవిష్కరణలను వేగవంతం చేసే దిశగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ, పూణెలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డీఐఏటీ) సంయుక్తంగా సోమవారం హైదరాబాద్ క్యాంపస్ లో 'డిఫెన్స్ & ఏరోస్పేస్ ఇండస్ట్రీ డే 2026' ను ఘనంగా నిర్వహించాయి. "మిషన్-రెడీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్...