RJNEWS TELUGU
Date of Publish : 07 August 2026, 6:23 pm Posted by : RJ NEWS TELUGU

కలెక్టరేట్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు

ఆర్.జె. న్యూస్, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కలెక్టరేట్‌లోని శ్రీ భువనేశ్వరీ మాత ఆలయంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఆలయం వరకు పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాల ఊరేగింపు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.వేడుకల్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.