గాయత్రి డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాల ఉత్సవం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో మంగళవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు సంప్రదాయబద్ధంగా బోనాలను అలంకరించి తీసుకొచ్చారు. అనంతరం విద్యార్థినులు పట్టణంలోని ఏడు గుడుల దేవాలయంలో కొలువైన అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాల పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థినులకు తెలియజేసేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థినుల సంప్రదాయ వస్త్రధారణ, బోనాల అలంకరణలు...