అర్చన కాలనీలో ఘనంగా బోనాలు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఆషాఢ బోనాల సందర్భంగా మేడ్చల్ సర్కిల్ పరిధిలోని కిష్టాపూర్ - పూడూరు డివిజన్‌లో గల కిష్టాపూర్ అర్చన కాలనీలో ఆదివారం నల్లపోచమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. ఉదయం ఘటమును ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అనంతరం కాలనీ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను అలంకరించి, నల్లపోచమ్మ అమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు...