తల్లిపాలు శిశువుకు అమృతాహారం..!
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలను ప్రారంభించి, మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలే అందించాలని సూచించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని, తల్లుల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. తల్లిపాల...