తల్లిపాలే శిశువుకు శ్రేష్ఠమైన ఆహారం.! ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు

ఆర్ జె న్యూస్, మేడ్చల్, : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మెడిసిటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో పిల్లల తల్లులు, గర్భిణీలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిపాల విశిష్టత, అవసరం, వాటిపై ఉన్న అపోహల నివృత్తిపై వైద్య నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా మెడిసిటి మెడికల్ డైరెక్టర్ డా. గీత మాట్లాడుతూ, శిశువుకు తల్లిపాలే అత్యంత సురక్షితమైన, సంపూర్ణమైన ఆహారమని పేర్కొన్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి–బిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని,...