దమ్మాయిగూడ శ్రీచైతన్య హాస్టల్లో పదో తరగతి విద్యార్థిపై దారుణ దాడి
ఆర్జె..న్యూస్,దమ్మాయిగూడ/మేడ్చల్ మల్కాజ్గిరి : దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై తోటి సీనియర్ విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థి అభిషేక్‌పై రాత్రి సమయంలో 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేసినట్లు, అంతేగాక బూట్లతో ముఖంపై తొక్కినట్లు బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు. దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడ్డాడు. మెట్లపై నుంచి కిందపడటంతో గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే పాఠశాలకు...