రాజేంద్రనగర్ లో దారుణ హత్య – స్నేహితుడినే కత్తులతో పొడిచి చంపిన మిత్రులు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఉప్పర్ పల్లి హ్యాపీ హోమ్స్ లో నివసిస్తున్న వసీం అనే యువకుడిని అతని స్నేహితులే అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదమే హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారాన్ని వసీం పోలీసులకు లీక్ చేస్తున్నాడనే అనుమానంతో అతని స్నేహితులు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. వసీం తో పాటు నిందితులపై గతంలో NDPS కేసులు నమోదైనట్లు...