బాలికల విద్యకు కెనరా బ్యాంక్‌ చేయూత

ఆర్ జె న్యూస్ మేడ్చల్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్‌లోని గురుకుల పాఠశాలలో కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. కెనరా బ్యాంక్‌ డివిజనల్‌ మేనేజర్‌ సమర్ల మైనర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ బాలికలను ప్రోత్సహించేందుకు సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా విద్యా జ్యోతి స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు తెలిపారు.5, 6, 7వ తరగతుల విద్యార్థినులకు రూ.3 వేల చొప్పున, 8, 9, 10వ తరగతుల విద్యార్థినులకు రూ.5 వేల చొప్పున...